గత ఏడాది కన్నడ సినిమాలు కేజీఎఫ్ 2, విక్రాంత్ రొనా, కాంతార వంటివి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతి నీ పెంచగా ఈ ఏడాది మలయాళం చిత్రాలు అదే బాట లో ఉన్నాయి.
ఈ ఏడాది విడుదల అయిన మంజుమ్మెల్ బాయ్స్ భారీ కలెక్షన్స్ తో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ గా నిలిచింది. కేవలం 20 కోట్ల తో తెరకెక్కిన ఈ మూవీ, ఇప్పటికే ఈ సినిమా 240 కోట్ల వసూళ్లు రాబట్టటం మలయాళం సినిమా చరిత్ర లో ఇదే ప్రథమం.
200 క్లబ్ లో చేరిన తొలి మలయాళం సినిమా కూడా మంజమ్మెల్ బాయ్స్ యే కావడం విశేషం. ఈ ఏడాది విడుదల అయిన ప్రేమలు దాదాపు 136 కోట్లు రాబట్టగా, గోట్ లైఫ్ పేరుతో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా 130 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇంతలా ఈ ఏడాది మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరటం ఇదే మొదటి సారి. మరి మలయాళం సినిమాలు కి ఇంత భారీగా రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటనేదానిపైన ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది.
సరి కొత్త కంటెంట్ తో మలయాళం చిత్రాలు
కమర్షియల్ గా ఆలోచించకుండా ప్రతిసారి కంటెంట్ పైనే మలయాళం సినిమాలో ఆధారపడి ఉంటాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాదాపు అన్ని సినిమాలు కూడా ఏదో ఒక వినూత్న కంటెంట్ తోటి మన ముందుకు వస్తూ ఉంటాయి.
కమర్షియల్ ఎలిమెంట్లు కన్నా కూడా సహజత్వానికి మలయాళం సినిమాలు పెద్ద పీట వేస్తాయి. ఎక్కువ నాచురల్ గా సాధారణ ప్రజల లైఫ్ కి మ్యాచ్ అయ్యేలాగా మలయాళం చిత్రాలు తీయడమే ఈ సినిమా ఇండస్ట్రీకి ప్లస్ పాయింట్ గా మారింది.
ఇప్పటి జనరేషన్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను కంటెంట్ బాగుంటే ఆదరించడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు.
వినూత్న కథ, నాచురల్ గా ఉండటం, భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా మలయాళం సినిమాలకు ఆదరణ పెరగడం మలయాళం ఇండస్ట్రీ ప్లస్ పాయింట్ గా మారింది.
ప్రేమలు ఉదాహరణగా తీసుకుంటే ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. మంజుమ్మెల్ బాయ్స్ అయితే తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల మలయాళం లో సక్సెస్ అవుతున్న సినిమాలు కూడా కేవలం మలయాళం నేటివిటీకి సంబంధించినవి కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేటివిటీ అంశాలను కూడా అందులో చేర్చడం కూడా సక్సెస్ కి కారణమై ఉండవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఉదాహరణకు మనుమ్మెల్ బాయ్స్ లో కొడైకెనాల్ నేపథ్యం ఉండటం తో తమిళనాడు నేటివిటీ కనిపించగా, ప్రేమలు సినిమా హైదరాబాద్ నేపథ్యంలో సాగటం మరో విశేషం. ఇక నేటివిటీకి భిన్నంగా పూర్తిగా కంటెంట్ పైన ఆధారపడిన బోట్ లైఫ్ అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఏది ఏమైనా ఇటీవల మలయాళం సినిమాలకు క్రేజ్ పెరగడం అనేది వాస్తవం. కంటెంట్ బాగుంటే భాష సినిమాలైనా ఇటీవల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో భాష అనే అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు.
Leave a Reply