పుష్ప, ఈ ఊరు పేరు మనకి ఎంత పాపులర్ అయ్యిందో అంతే రేంజ్ లో అందులోని క్యారెక్టర్లు కూడా బాగా పాపులర్ అయ్యాయి అని మనకు తెలుసు. పుష్పరాజ్ తగ్గేదే లే అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, నా సామి అంటూ శ్రీవల్లి చేసిన హడావుడి కూడా ఫ్యాన్స్ లో చెరగని ముద్ర వేసిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల పుష్ప 2.0 (pushpa the rule) సంబంధించిన టీజర్ మరియు శ్రీవల్లి లుక్ విడుదల కాగా ఇవి వైరల్ అయ్యాయి.
శ్రీవల్లి 2.0 (sreevalli 2.0) లేటెస్ట్ లుక్ లో రష్మిక భారీగా నగలు ధరించి రిచ్ లుక్ లో కనిపిస్తుంది. దీనిపై ఈసారి తను ప్లే చేసే క్యారెక్టర్ ఎలా ఉంటుందని దానిపైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ లో తన నటన మరియు క్యారక్టర్ సంబంధించి కీలక అప్డేట్స్ ను రష్మిక పంచుకున్నారు.
సీక్వెల్ లో శ్రీవల్లి క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని sreevalli 2.0 ను ప్రేక్షకులు చూస్తారని తెలిపింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప (pushpa the rise) లో శ్రీవల్లి ఒక అమాయక ఆడపిల్ల పాత్రలో కనిపిస్తుంది. మొదటి పార్ట్ చేసేటప్పుడు తనకు సినిమా మరియు తన క్యారక్టర్ పై పెద్దగా అంచనాలు అవగాహన లేదు అని, ఇప్పుడు తన రోల్, కథ పై ఫుల్ క్లారిటీ ఉందని రష్మిక తెలిపారు.
భారీ అంచనాల నడుమ పుష్ప రెండో పార్ట్ పుష్ప ది రూల్ Pushpa 2: The Rule ఆగస్టు 15 2024 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Leave a Reply