మిల్క్ బ్యూటీ గా పేరు పొందిన పాపులర్ నటి తమన్నా, చిన్న సినిమాలతో మొదలైన తన ప్రయాణం బాహుబలి లాంటి దిగ్గజ ప్రాజెక్టులు చేసే వరకు వెళ్ళడం చిన్న విషయం కాదు.
అలాంటి ఈ మిల్క్ బ్యూటీ కి చాలా మందే ప్రపోజ్ చేయడం సహజం. అయితే ఈ బ్యూటీ ఎవరినైనా ప్రేమించిందా అని చాలా మందికి సందేహం.
సినిమా స్టార్లు సహజంగా వాళ్ళ లావ్ స్టోరీలు గురించి ఎక్కువగా చెప్పుకోరు.. అయితే ఈ బ్యూటీ తాజాగా తన ప్రేమాయణం గురించి బట్టబయలు చేసేసింది.
తను ఒకటి కాదు రెండుసార్లు ప్రేమలో పడ్డానని కుండ బద్దలు కొట్టింది. అయితే ఆ ఇద్దరు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు గాని, రెండుసార్లు కూడా విఫలమైనట్లు తెలిపింది.
తొలిసారి టీనేజ్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డా కానీ తన కోసం కెరీర్ ఫణంగా పెట్టాల్సి వచ్చే సరికి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాను అని తెలిపింది.
ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడ్డా కానీ ఆ వ్యక్తి అబద్దాలు చెప్తుండడంతో అతని వదిలించుకున్నట్లు తెలిపింది.
రెండుసార్లు కూడా చాలా బాధపడ్డానని తమన్నా వెళ్లడిందించి. మరి పెళ్లి ఎప్పుడో క్లారిటీ అయితే లేదు. ఇంకా అడపా దడపా సినిమాలు చేస్తూ కొంచెం బిజీగానే ఉంది ఈ బ్యూటీ.
Leave a Reply