ఇలియానా కాబోయే భర్తని, బిడ్డకి తండ్రి ని రివీల్ చేసింది … మిస్టరీ మ్యాన్ ఇతనే.

గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు తనకు కాబోయే భర్త ను బయటపెట్టింది. పెళ్లి ప్రస్తావనే లేకుండా గర్బవతిని అంటూ అందరికీ షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు తన బిడ్డ కు తండ్రి ని పరిచయం చేసింది.

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలు కెరీర్కు శాపంగా మారాయి.

బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది హీరోయిన్గా అవకాశాలు తగ్గాయి. లవ్, ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. ఇటీవల సడన్ గా తాను గర్భవతి అంటూ ప్రకటన చేసింది. ఇలియానా చేసిన ఈ ప్రకటనతో అంతా షాక్ అయ్యారు. పెళ్లి కాలేదు అప్పుడే గర్వం ఏంటి? అసలు ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు, ఒకవేళ రహస్యంగా పెళ్లి చేసుకుంది అనుకున్న ఆమె బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఫ్యాన్స్ లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి.

ప్రస్తుతం 9 నెలల నిండు గర్భవతి త్వరలో బిడ్డకి జన్మనివ్వబోతుంది ఇప్పటికైనా ఇలియానా తన ప్రియుడ్ని బిడ్డకి కాబోయే తండ్రిని రివిల్ చేస్తుందని ఫాన్స్ ఎదురు చూశారు. అనుకున్నట్లే ఎట్టకేలకు ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని రివిల్ చేస్తూ ఫోటో షేర్ చేసింది. తన ప్రియుడుతో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఇలియానా అక్కడ అతనితో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దీనితో ఇలియానా మిస్టరీ మ్యాన్ వెలుగులోకి వచ్చాడు

.

కంప్లీట్ గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే అతడు విదేశీయుడా అని అనే అనుమానం కలుగుతుంది. అయితే అతడి పేరు వివరాలేవీ బయటకి రాలేదు. ఇప్పటివరకు ఇలియానా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ ను డేటింగ్ చేస్తూ ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇలియానా ఈ పిక్ పోస్ట్ చేయడంతో అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.

ఇలియానా అసలైన ప్రియుడు తన బిడ్డకి తండ్రి వెలుగులోకి వచ్చేసాడు. అసలు అతను ఎవరు, ఇండియన్ అవునా కాదా,లేక విదేశీయుడా, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఫ్యాన్స్ జోరుగా ఆరా తీస్తున్నారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Write your Review on this Movie