పలాస దర్శకుడు తో కలిసి వరుణ్ తేజ్ ! 1960 కాలానికి… జూలై 27న గ్రాండ్ లాంచ్….

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా కొన్ని డిఫరెంట్ జోనల్ సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమా ఒక్కోలా ఉండేలా చూసుకుంటున్నాడు…. ఇప్పుడు మొదటిసారి పిరియాడిక్ ఫిల్మ్ చేయనున్నాడు. ఇందులో భాగంగా తన 14వ చిత్రానికి సంతకం చేశాడు…. పలాస ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం లో వరుణ్ తేజ్ 14 సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని మునిపెన్నడూ చూడని క్యారెక్టర్ లో చూపించనున్నారు…..

జూలై 27వ తేదీన హైదరాబాద్లో గ్రాండ్ లాంచ్ కానున్న ఈ ప్రాజెక్టు కోసం వరుణ్ తేజ్ పూర్తిగా భిన్నమైన మేకోవర్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు తాత్కాలికంగా VT14 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం అవుతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి(సివిఎం) మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.

VT 14 అనేది పిరియాడిక్ ఫిల్మ్ మరియు 1960ల కాలం నేపథ్యంలో సెట్ చేయబడుతుంది. 1960ల నాటి వాతావరణం మరియు అనుభూతిని పొందడానికి చిత్ర బృందం అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని పోషిస్తాడు. సినిమాలో అతని లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది….. టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టుకి పనిచేస్తారు. ఇక ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది….

Leave a Reply

Write your Review on this Movie