“దేవర” లో ఎన్టీఆర్ కి తల్లిగా స్టార్ హీరోయిన్!!!! ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసిన కొరటాల !…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, సక్సెస్ ఫుల్ అండ్ స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తున్న  సినిమా “దేవర “. ఈ సినిమాను కొట్టాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు!….    అయితే ఈ పాన్ ఇండియా సినిమా”దేవర” కోసం తారక్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా నుండి వెలువడిన చిన్న న్యూస్ ను అయినా క్షణాల్లో ట్రెండ్ చేస్తున్నారు….   ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుండి రిలీజ్ అయినా  పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా!!!! తాజాగా ఈ మూవీ నుండి మరో న్యూస్ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది..

ఈమధ్య కథలో కంటెంట్ బాగుంటే చాలు ఎలాంటి క్యారెక్టర్ నైనా చేయడానికి నటి,నటులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త ప్రయోగాలు వైపు ప్రణాళికలను తయారు చేసుకుంటూ అడుగులు వేస్తోంది.. నటీనటులు సైతం  మూవీ మేకర్స్ ఆలోచనలకు తగ్గట్టుగానే పాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు..  కాగా!! ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల తారలు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం  అత్త, అమ్మ,వదిన, బ్రోతల్, వ్యాంప్ ఇలా క్యారెక్టర్ ఏదైనా పర్లేదు అని తమ పాత్రకు ప్రాధాన్యం ఉంటే చాలు అని వివిధ క్యారెక్టర్లు చేస్తూ…..రాణిస్తున్నారు… తాజాగా ఇదే కోవలోకి  మరో స్టార్ హీరోయిన్ ప్రియమణి రాబోతున్నట్లు సమాచారం.

  ప్రస్తుతం ” దేవర ” సినిమాకి సంబంధించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది!…    అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అమ్మ పాత్రలో హీరోయిన్ ప్రియమణి చేస్తున్నారట. అవును!  ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎన్టీఆర్ తండ్రి పాత్రకు జోడీగా ప్రియమణి ని తీసుకున్నారని సమాచారం.. అలా చిన్నప్పటి ఎన్టీఆర్ కు అమ్మగా ప్రియమణి ఈ మూవీలో  నటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మొదట కొంత అవాక్కైనా!!! ఆ తర్వాత కథ సారాంశాన్ని బట్టి ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు…

గతంలో ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ అయినా  “యమదొంగ” మూవీ లో ప్రియమణి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు…  ఇక ఇప్పుడు  జూనియర్ ఎన్టీఆర్ కి తల్లి పాత్రలో నటించనుంది….. కాగా! ఇటీవలే “జవాన్” మూవీలో  మెరిసి ఫ్యాన్స్ ను  ఎంతగానో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.    కొన్ని రోజుల క్రితం వరకు కూడా ప్రియమణి బుల్లితెరపై సందడి చేసింది. పలు షోల తో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటించి అందరిని అలరించింది….

  అయితే ఈ మూవీలో  ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తున్నారు….  అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూడా  నటిస్తున్న సంగతి తెలిసిందే… ఈ చిత్రంకు  లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అయిన అనిరుద్ సంగీతం ను సమకూరుస్తున్నాడు.. ఈ సినిమా వచ్చే ఏడాది “ఏప్రిల్ 8″న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూడవలసిందే.

అయితే “దేవర” మూవీ కోసం కొరటాల శివ తీసుకున్న ఈ నిర్ణయం!! ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ గురి చేసిందనే చెప్పాలి. అయితే సినీ ఇండస్ట్రీలో ఇదేమి కొత్త కాదు!!!!   అలనాడు సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన ఎందరో అందాల తారలు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో నటించి మెప్పించారు.. ఈ సెంటిమెంట్ నే కొరటాల శివ వాడుతున్నట్లుగా అనిపిస్తుంది.. మరి ఈ సినిమా లో ప్రియమణి నటన “దేవర”కు ఎంత మాత్రం ఉపకరిస్తుందో ఫ్యాన్స్ వేచి చూడవలసిందే….

 

Leave a Reply

Write your Review on this Movie