Bharateeyudu 2 OTT: అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఆదివారం చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.
ఆ రోజు నుంచే భారతీయుడు 2 Netflix లో [Bharateeyudu 2 OTT Release Date]
భారతీయుడు 2 ఆగస్ట్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో భారతీయుడు 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన భారతీయుడు 2
భారతీయుడు సినిమా ఆరోజుల్లో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు.. అయితే దీనికి సీక్వెల్ తీయాలని చాలా సంవత్సరాలుగా అటు డైరెక్టర్ శంకర్ మరియు కమలహాసన్ కసరత్తు చేస్తూ వచ్చారు. పలు అడ్డంకులు ఏర్పడిన ఈ సినిమాని ఎట్టకేలకు 2024 నాటికి పూర్తి చేయడం జరిగింది. భారీ బడ్జెట్ పోసి దాదాపు 250 కోట్లతో భారతీయుడు 2(Indian 2) సినిమాని నిర్మించారు. అయితే ఇన్ని సంవత్సరాల క్రిఎట్ చేసినంత హైప్ సినిమా ను నిలబట్టలేకపోయాయి. కంటెంట్ మరియు కొత్తదనం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో చేసేది ఏమీ లేక నెల రోజుల్లోనే ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని భాషల్లో Indian 2 సినిమా ఆగస్టు 9 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
చూద్దాం మరి ఓటిటి ప్రేక్షకుల పైన ఈ సినిమా నచ్చుతుందో లేదో.
Leave a Reply