దసరా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ కి కారణం ఇదా. ఇంత భారీ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం.

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ రెండో వారంలోకి అడుగు పెట్టింది. దసరా సినిమా 100 కోట్ల గ్రాస్ ని అందుకుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానికి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు. దీంతో ఎప్పటినుండో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని ఫాన్స్ కి ఎంతో ఆనందాన్ని ఇచ్చాడాని చెప్పాలి.

దసరా సినిమా 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమాకు నాని తప్ప మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఆకర్షణ లేదు. ఇక కీర్తి సురేష్ కొంతమేర తోడైంది. ఇక కథను మలుపు తిప్పే సూరిగా దీక్షిత్ శెట్టి,విలన్ చిన్ననంబిగా చేసిన షైన్ టామ్ చాకో ఇద్దరు కొత్త వారే. ఇక దసరా పాటల విషయానికొస్తే సంతోష్ నారాయణ అందించిన పాటల లో దోస్తాన్, వదినే రెండు పాటలు మాత్రమే ఛార్జ్ బూస్టర్స్ అయ్యాయి. ఇక దసరా నిర్మాత వరస ప్లాపుల్లో ఉన్నారు. దీంతో అవుట్ రైట్ గా నైజాం ఏరియా హక్కులను దిల్ రాజుకు అమ్మేశారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతే కాకుండా రెండో వారంలోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీంతో సుధాకర్ చేరుకూరి ఏకంగా కోటి రూపాయల కారుని శ్రీకాంత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు.

నాని వన్ మ్యాన్ షో అన్ని వర్గాలను అంగీకరించేలా చేసింది. ఇక దీంతో నాని పాన్ ఇండియా కళ నెరవేరడమే కాకుండా నాని కెరియర్ లోనే మంచి బ్లాక్ బాస్టర్ హిట్గా సినిమా నిలిచింది. ఇక దసరా సినిమా ఇప్పటికీ మొదటి వారం మాత్రమే పూర్తయింది. ఇక రేపు రిలీజ్ కాబోతున్నాం రావణాసుర,మీటర్లకొచ్చే టాక్ ని బట్టి దసరా సినిమా పికప్ ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయవచ్చు. మాస్ హీరోగా నానికి యూనివర్సల్ యాక్సెప్ టెన్స్ దొరికేసింది. ఈ తరహా సబ్జెక్టులతో మెప్పించవచ్చని శ్రీకాంత్ ఓదెల నిరూపించాడు. అందుకే దసరా వంద కోట్లు స్పెషల్ గా నిలిచిపోయింది.

Rate this Movie

Leave a Reply

Write your Review on this Movie