ఇస్మార్ట్ శంకర్ తర్వాత అటు హీరో రామ్ పోతినేని కి మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవని చెప్పాలి. వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ పోతినేని తన పాత హిట్ సీక్వెల్ పైన గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.
మరి హీరో రామ్ హిట్ కొట్టాడ?
మరి హీరో రామ్ డబల్ ఇస్మార్ట్ తో హిట్ కొట్టడా అంటే.. వినడానికి ఆయన ఫ్యాన్స్ కి కొంచెం కష్టంగా ఉన్నా వాస్తవానికి ఈ సినిమా కూడా పబ్లిక్ కి నచ్చలేదు అని టాక్.
సినిమా రివ్యూ విషయానికొస్తే, సినిమా మొత్తం మెదడు లో ఉన్న చిప్, బిగ్ బుల్ , శంకర్ చుట్టే తిరుగుతుంది. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా పదును లేని సీన్స్ మరియు ట్రాక్ లతో సాగదీసినట్టు ఉంది. సంజయ్ దత్ తన మెమోరీస్ మొత్తం శంకర్ బ్రెయిన్ చిప్ లో పెట్టీ తన లా మార్చుకోవడం సినిమా కాన్సెప్ట్. మరి ఈ చిప్ తో మెమరీ మొత్తం కోల్పోయిన హీరో తన శత్రువు అయిన సంజయ్ దత్ పై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేదే సినిమా.
ఫస్ట్ సీన్ లోనే రివెంజ్ మూవీ అని చాలా వరకు స్టోరి అర్థమై పోతుంది. ఆలీ ట్రాక్ అయితే క్లారిటీ లేదు. పెద్దగా ట్విస్ట్ ఏమి లేకపోవడం సినిమా కి మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా చోట్ల డబల్ మీనింగ్ డైలాగ్ లు, హావ భావాలు కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇబ్బంది పెడతాయి. ఇలాంటి మితి మీరిపోయిన డైలాగులు అవసరమా అని కూడా పబ్లిక్ పూరి జగన్నాథ్ నీ అడుగుతున్నారు. కేవలం రామ్ పోతినేని నటన మాత్రమే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. కావ్య తప్పర్ గ్లామర్ రోల్ కి పరిమితం అయింది.
ఇంకా డబుల్ ఇస్మార్ట్ తో మరో ఫ్లాప్ మూటగట్టుకున్న పూరి ?
లైగర్ సినిమాతో ఎక్కడో ఉన్న విజయ్ దేవరకొండ ని మా పాతాళానికి తీసుకెళ్లిన పూరి,హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పొతినేని కి కూడా ఫ్లాప్ మూటగట్టాడు అని టాక్. మాకు కంటెంట్ ఉన్న సినిమాలు కావాలి, బూతు సినిమాలు కాదని ప్రజలు పబ్లిక్ టాక్ లో తిడుతున్నారు. ఏది ఏమైనా డబుల్ ఇస్మార్ట్ పాపం డైనమిక్ హీరో రామ్ పోతినేని కి చేదు అనుభవంగానే చెప్పాలి. కనీసం తరువాత సినిమాలు అయినా ఆయనకు హిట్ కావాలని కోరుకుందాం.
Leave a Reply