నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఐపీఎల్ మరింత కిక్కెక్కించెందుకు బ్రాడ్కాస్టర్ అయిన “స్టార్ స్పోర్ట్స్” స్టార్ హీరో అయినా బాలయ్యను రంగంలోకి దించుతుంది.

హీరోగా నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ గోల గోల చేస్తారు థియేటర్స్ మొత్తం విజిల్స్ అరుపులతో మోగిపోతుంది ‌. గొడవలు తోపులాటలతో సినిమా థియేటర్స్ లోని సీట్లు మొత్తం విరగాల్సిందే అని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య కూడా ఆ రేంజ్ లోనే అభిమానులను ఖుషి చేస్తాడు బాలయ్య బాబు వెండితెర పైనే కాకుండా ఇటీవల బుల్లితెరపై కూడా పలు టాక్స్ షోలకు హోస్ట్ చేస్తూ దూసుకెళ్తున్నారు తాజాగా మరో కొత్త అవతారం కూడా ఎత్తబోతున్నారు క్రికెట్ అభిమానులను కూడా ఖుషి చేసేందుకు తనవంతుగా హెల్మెట్ ను ధరించి ప్యాడ్లు కట్టుకొని బ్యాటు బాల్ తో రెడీ అయ్యారు. ‌ప్రతి నందమూరి అభిమానులు, క్రికెట్ అభిమానులు టీవీలలో ప్రత్యక్ష మయ్యి పూనకాల తెప్పించడానికి “స్టార్ స్పోర్ట్స్” వారు పెద్ద ప్లానే వేశారు..

IPL 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ March 31

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ఆరంభానికి ముందు ఐపీఎల్ అభిమానులకు మంచి శుభవార్తను తెలియజేసింది ఆ శుభవార్త ఏమనగా. అయితే మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 నుంచి ప్రారంభం కానుంది ‌‌. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిపెడింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్లేయర్స్ సిద్ధమవుతుండగా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తెలుగు అభిమానులకు ఫుల్ కిక్ అందించే ఐపిఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ స్టార్ హీరో ను రంగంలోకి దించబోతుంది. దీంతో సినీ అభిమానులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్న నందమూరి నరసింహ యువరత్న బాలకృష్ణ గారు…. ఇక క్రికెట్ అభిమానులను కూడా ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యారు ‌‌.

నందమూరి బాలకృష్ణ as a cricket commentator

బాలయ్య బాబుగారు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు .ఐపీఎల్ 2023 ఓపెనింగ్ రోజు (మార్చి 31న) బాలయ్య బాబుగారీ కామెంట్రీ ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ తెలుగు వెల్లడించింది దీనికి సంబంధించి ఓ ట్విట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో బాలకృష్ణ ఎలా కామెంట్రీ చేస్తారో చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2 responses to “నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఐపీఎల్ మరింత కిక్కెక్కించెందుకు బ్రాడ్కాస్టర్ అయిన “స్టార్ స్పోర్ట్స్” స్టార్ హీరో అయినా బాలయ్యను రంగంలోకి దించుతుంది.”

  1. Sk khajavai avatar
    Sk khajavai

    Thank you information madam manchi subhavartha chepparu madam jai balaiah jai jai balaiah…. 🥳🥳🥳

    1. admin avatar
      admin

      TQ 🙏

Leave a Reply

Write your Review on this Movie