Super star మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 పోస్టర్ చూశారా

మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీని ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఆ డేట్ కాస్త ఇప్పుడు సంక్రాంతికి మారింది. 2024 జనవరి 13న థియేటర్లలోకి ఈ మూవీ వస్తుందని నిర్మాత అయిన నాగవంశీ ట్విట్ చేశారు‌ మహేష్ సిగరెట్ కాలుస్తూ నడుస్తూ ఉన్న ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. మిర్చి గాలిలోకి ఎగురుతుండగా స్టైల్ గా మహేష్ నడుస్తూ వస్తున్న లుక్ సినిమాపై రేంజ్ లో భారీఅంచనాల్ని పెంచేస్తోంది.

ప్రస్తుతంSSMB 28 షెడ్యూల్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అతడు ,ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం రిలీజ్ విషయంలో మాత్రం వెయిటింగ్ తప్పేలా లేదు…. ముందుగా అనుకున్న ఏప్రిల్ 28వ తేదీను … ఆగష్టు 11 కు పోస్ట్ పోన్ చేశారు… అయితే ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ వచ్చే సంక్రాంతికి అని అంటున్నారు. తమన్ ఈ సినిమాకు అద్భుతమైన బాణీలతో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక్కడ మన మెయిన్ గా ప్రస్తావించ వలసిన విషయం ఏమిటి అనగా….. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ లో కనపడబోతున్నారు.

Title releasing date

Mahesh Babu -SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడోసారి రూపొందుతున్న చిత్రం వర్కింగ్ టైటిల్ SSMB28. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ‌. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు రానున్న శ్రీరామ నవమికి SSMB 28 టైటిల్ ను(SSMB 28 Title) అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమాను నిలిపారు, ఇప్పుడు మహేష్ కూడా చేరాడు. బహుశా రామ్ చరణ్. “గేమ్ చేంజర్” కూడా సంక్రాంతి బరిలో ఉండొచ్చని అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద బ్యాండ్ భాజా భారాత్ గ్యారెంటీగా తప్పదు అని అనిపిస్తుంది

OTT డిజిటల్ రైట్స్ – నెట్ ఫ్రీక్స్

మహేష్ బాబు త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటిటి వేదిక నెట్ ఫ్రీక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది థియేటర్ విడుదల తర్వాత తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో సినిమాలు తమ ఓ టి టి వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది ఈ నేపథ్యంలో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా ఓటిటి రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు తెలుస్తుంది

Leave a Reply

Write your Review on this Movie