“వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ” పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? పెళ్లి అక్కడే జరుగుతుంది….

మెగా ఫ్యామిలీలో, లవ్ బర్డ్స్ వరుణ్-లావణ్యా పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? అంటే అవునని టాక్ వినిపిస్తుంది. జూన్ 9న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది….. లావణ్య త్రిపాఠి తో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ విషయం మెగా ఫాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు . ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది…..

మెగా ఫ్యామిలీలో బోలెడంత మంది హీరోలు ఉన్నా వాళ్ళందరిలో సంథింగ్ డిఫరెంట్ గా ఉండే మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…. లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ కు చెందినవారు మరియు డెహ్రాడూన్లో పెరిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. మరియు అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాలతో తన ప్రతిభతో మరియు అందంతో మంచి ఇమేజిని సంపాదించుకున్నారు… వరుణ్ మరియు లావణ్య మిస్టర్ మరియు అంతరిక్షం 9000 KMPH కలిసి నటించారు… ప్రస్తుతం వరుణ్ “గాంఢీవధారి అర్జున” అనే క్లాస్ యాక్షన్ చేస్తున్నారు…. ఇది ఆగస్టు 25న థియేటర్లోకి రానున్నదని ప్రకటించారు..

మరోవైపు నేర్చుతార్థం చేసుకున్న వరుణ్ లావణ్య త్రిపాఠి ఈమధ్య కాఫీ డేట్ కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలన్నీ ఇన్స్టాలొ స్టోరీస్ గా పెట్టారు…. జూన్ లో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే ఈ ఏడాదిలో పెళ్లి ఉంటుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏకంగా డేట్ ఇదేనంటూ ఒకటి బయటకు వచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని మాట్లాడుకుంటున్నారు… వధూవరుల కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి జరగాలని నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టాను సమాచారం. అయితే సినిమా రిలీజ్ పెట్టుకుని వరుణ్ ఆగస్టులో పెళ్లి చేసుకుంటాడా? లేదా ఇది రూమర్ మాత్రమేనా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది….

One response to ““వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ” పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? పెళ్లి అక్కడే జరుగుతుంది….”

  1. A.nagaraju avatar
    A.nagaraju

    Intresting information

Leave a Reply

Write your Review on this Movie